మంత్రి ఆదినారాయణరెడ్డిని బర్తరఫ్‌ చేయాలి

–క్షమాపణ చెప్పక పోవడంపై దళితుల నాయకులు ఆగ్రహం
రొద్దం: దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి ఆదినారాయణరెడ్డిని వెంటనే బర్తరఫ్‌ చేయాలని వైయస్‌ఆర్‌ సీపీ దళిత నాయకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఆర్‌ఏ రవిశేఖర్‌రెడ్డి నివాసంలో వారు విలేకరులతో మాట్లాడారు. మంత్రి అహంకారంతోనే దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేశాడన్నారు. ఇప్పటికీ ఆయన దళితులకు క్షమాపణ చెప్పకపోవడంపై మండిపడ్డారు. చంద్రబాబు దళిత ద్రోహి కాబట్టే మంత్రి ఈ వ్యాఖ్యలు చేశాడని ఆరోపించారు. ఆయనపై ఎస్సీ,ఎస్టీ అట్రాసీటీ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.కార్యక్రమంలో వైయస్‌ఆర్‌ సీపీ జిల్లా అధికార ప్రతినిధి చంద్రశేఖర్,మండల ఎస్సీసెల్‌ అధ్యక్షుడు సినిమా నారాయణ,శ్రీనివాసులు,పలువురు దళితులు పాల్గొన్నారు.

Back to Top