మినుము రైతుల‌ను ఆదుకోవాలి

నెల్లూరు: వ‌ర్షాభావ ప‌రిస్థితులు, తెగుళ్ల ద్వారా న‌ష్ట‌పోయిన మినుము రైతుల‌ను ఆదుకోవాల‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావ‌లి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్ర‌తాప్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లాలోని బోగోలు మండలం  కొండ బిట్రగుంట ,పాత బిట్రగుంట గ్రామాలలో ఎండిపోయిన మినుము పంటను కావ‌లి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..తెగుళ్ల కార‌ణంగా పంట‌లు చేతికందే ప‌రిస్థితి లేద‌న్నారు. న‌ష్ట‌పోయిన రైతుల‌ను ఆదుకునేందుకు వెంట‌నే స‌ర్వే నిర్వ‌హించి బాధితుల‌కు ప‌రిహారం చెల్లించాల‌ని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. అనంత‌రం కావ‌లి ఆర్‌డీవో భ‌క్త‌వ‌త్స‌ల్య రెడ్డిని క‌లిసి రైతు స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని ఎమ్మెల్యే కోరారు. అనంత‌రం  పార్టీ నాయ‌కుడు జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి కేత్రిరెడ్డికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆయ‌న వెంట పార్టీ నాయ‌కులు ఉన్నారు.
Back to Top