రైతు రుణాలు మాఫీ చేయాలి

ఢిల్లీ: సంక్షోభంలో ఉన్న రైతులందరి రుణాలు మాఫీ చేయాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. లోక్‌సభలో బడ్జెట్‌పై ఆయన ప్రసంగించారు. ఏపీకి విభజన సమయంలో ఇస్తామన్న ప్రత్యేక హామీలన్నింటిని ప్రభుత్వం నెరవేర్చాలని, ఏపీని అన్ని విధాల ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రత్యేక హోదా వాగ్ధానాన్ని నిలబెట్టుకోవాలని కోరారు. రైతుల ఆదాయం రెండింతలు చేస్తామన్న మంత్రి ప్రకటనలో స్పష్టత లేదని, అదెలా సాధ్యమో చెప్పాలన్నారు. ఒకవైపు ద్రవోల్భలం పెరుగుతున్నా..రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని, సంక్షోభంలో ఉన్న రైతుల రుణాలు మాఫీ చేసి ఆదుకోవాలని మిథున్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. లేదంటే కాంగ్రెస్‌కు పట్టిన గతే బీజేపీకి పడుతుందని ఆయన హెచ్చరించారు.

తాజా ఫోటోలు

Back to Top