సిట్ వద్దు..సీబీఐ ఎంక్వైరీ జరగాలి

హైదరాబాద్ః విశాఖ భూకబ్జాలపై సీబీఐ ఎంక్వైరీ జరిగితేనే జిల్లా ప్రజలకు న్యాయం జరుగుతుందని వైయస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. బాబు ఎక్కడ సిట్ అంటే అక్కడ సిట్ అయ్యే సిట్ విచారణతో పేదలకు ఎలాంటి న్యాయం జరగదన్నారు. దొంగ చేతికి తాళాలిచ్చినట్టు జిల్లాలోని అధికారులను సిట్ లో ఇన్ వాల్వ్ చేయడం శోచనీయమన్నారు. ప్రభుత్వ భూదందాలను నిరసిస్తూ విశాఖలో ఈనెల 22న వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామన్నారు. తమ అధినేత వైయస్ జగన్ కూడ ఈ ధర్నాలో పాల్గొంటారని బొత్స స్పష్టం చేశారు. అన్ని పార్టీలు కదలిరావాలని విజ్ఞప్తి చేశారు.

Back to Top