జేసీ బ్రదర్స్ ను అరెస్ట్ చేయాలి

  • బూతులు తిడుతున్నారంటే మీ వద్ద పసలేనట్లే
  • జేసీ సోదరుల చరిత్ర అందరికి తెలుసు
  • రాజకీయాల్లో జేసీ సోదరుల పదజాలం దారుణం
  • వైయస్‌ జగన్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు
  • పిల్లనిచ్చిన మామతో పాటు బంధువులను ముంచిన ఘనుడు బాబు
  • మూడేళ్ల పాలనలో ఓట్లు అడిగే ధైర్యం టీడీపీకి లేదు
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు
హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబువి హత్యా రాజకీయాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. అధికారం కోసం చివరకు పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచారని, అవసరం తీరాక బంధువులను నెట్టివేసే రాక్షస మనస్తత్వం కలిగిన వ్యక్తి ఏపీ సీఎం అని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై చేసిన ఆరోపణలను అంబటి రాంబాబు ఖండించారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అంబటి రాంబాబు ఏమన్నారంటే.. ప్రధాన ప్రతిపక్షనాయకుడి మీద బురద జల్లే కార్యక్రమానికి  రాష్ట్రంలో అధికార పార్టీ శ్రీకారం చుట్టింది. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సిగ్గుచేటు. చేసిన పనుల గురించి గొప్పగా చెప్పుకోండని ప్రభుత్వానికి హితవు పలికారు.

అన్నను మించిన తమ్ముడు జేసీ  ప్రభాకర్‌రెడ్డి
వైయస్‌ జగన్‌ ప్రటిష్టను దెబ్బతీసేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు దారుణమని అంబటి రాంబాబు అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నను మించిన తమ్ముడిలా ఉన్నారు. మొన్న చంద్రబాబు సమక్షంలోనే జేసీ దివాకర్‌రెడ్డి వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డిని నా..అంటూ వాడకూడని పదజాలం వాడారు. టీవీల్లో చూపించలేనటువంటి పదజాలం వాడారు. దానికి మించి ఒక్కొక ఐదారు డిగ్రీలు ఎక్కువగా ఇవాళ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడారు. ఇదంతా చంద్రబాబు ఆడిస్తున్న డ్రామా అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. రుజువులు కూడా చూపించాల్సిన అవసరం లేదు. చంద్రబాబు సమక్షంలోనే ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అశ్లీలంగా మాట్లాడారు. ఆ అశ్లీల మాటలను చంద్రబాబు సంగీతంగా ఆస్వాధించారు. ఇంతకు ముందు కూడా తెలంగాణలో కేసీఆర్‌ను నర్సిరెడ్డి ఇలాగే మాట్లాడితే చంద్రబాబు ఇలాగే ఆనందంగా విన్నారు. అందుకే ఓటుకు కోట్లు కేసులో కేసీఆర్‌ చంద్రబాబును విరగొట్టేశారు. రాజకీయాల్లో ఉన్నవారు భాషాను కంట్రోల్‌ చేసుకోవాలి. టీడీపీ నేతలు పచ్చి బూతులు తిట్టే కార్యక్రమాన్ని వచ్చారంటే మీ వద్ద పస లేనట్లే..మీ వద్ద ధైర్యంగా ఎదుర్కొనే దమ్ము లేదనే అర్థం. 

టీడీపీ నేతలు దేవతలా?
పచ్చి బూతులు తిడుతున్న టీడీపీ నేతలు ఏమైనా దేవతలా అని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.  వర్ల రామయ్య, జేసీ సోదరులు, చింతమనేని ప్రభాకర్‌ వీళ్లంతా దేవతలా?. మేమంతా రాక్షసులమా? ప్రభాకర్‌రెడ్డితో చంద్రబాబు  అసహ్యంగా మాట్లాడించారు. 

బాబుది రాక్షస మనస్తత్వం
హత్యలతో, మనుషులను చంపి రాజకీయాలు చేసేవారు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక్క చంద్రబాబే. పదవి ఉంటే చాలు ఎవరైనా తొక్కేస్తారు. తొలగించేస్తారు. సాక్షాత్తు పిల్లనిచ్చిన మామ ఎన్‌టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుది. బాబు నాయకత్వంలో ఎన్ని హత్యలు చేశారండి.  బాబు హయాంలో వంగవీటి మోహనరంగను హతమార్చితే తప్ప రాజకీయంగా విజయవాడలో ముందుకు వెళ్లలేమని కుట్ర చేసి హత్య చేశారు. పింగలి నరసింహరావు అనే జర్నలిస్టును, రాఘవేంద్రరావు వద్ద చీప్‌ సెక్రటరీగా పనిచేసిన ఐఏఎస్‌ ఆఫీసర్‌ను దారుణంగా హత్య చేయించారు.  మల్లెల బాబ్జిని హత్య చేసింది చంద్రబాబు బృందమే. హత్యా రాజకీయాలు చేసి అధికారాన్ని నిలబెట్టుకోవాలన్నది, మనషుల ప్రాణాలను ఫణంగా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని ప్రయత్నం చేసే మనస్తత్వం కలిగిన వ్యక్తి చంద్రబాబు. దగ్గుపాటి వెంకటేశ్వరరావును ఎన్‌టీఆర్‌ మరణం తరువాత  దగ్గరకు తీసుకొని బాబు సీఎం అయ్యాక ఎక్కడికి పంపించారో అందరికీ తెలుసు. ఎన్‌టీఆర్‌ కుమారుడు హరికృష్ణను అవసరం తీరాక ఎలా నెట్టివేశారో తెలుసు. రక్తం పుచ్చుకుని పుట్టిన నారా రామ్మూర్తినాయుడు బాబును ఛీ అని తిట్టి కాంగ్రెస్‌లో చేరారు.  ఆయనకు ఎవరు అక్కరలేదు. కేవలం ఒక్క కుమారుడు ఉంటే చాలు. రాజకీయాల్లో ఇంత రాక్షస మనస్తత్వం కలిగిన వ్యక్తి బాబు ఒక్కరే. ఇవాళ ప్రెస్‌మీట్‌ చూస్తే చాలా ఆశ్చర్యమేస్తోంది. కలెక్టర్‌ను వైయస్‌ జగన్‌ అలా మాట్లాడతారా అని అంటున్నారు. ఏం తప్పు మాట్లాడారు. మీలాగా దూషించలేదు. మీరు ఒకకరికి చెప్పే ముందు వెనుక్కు తిరిగి చూసుకోవాలి. చంద్రబాబు అధికారులను ఎన్ని మాటలు అన్నారో గుర్తు చేసుకోవాలి. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారులను ఇష్టరాజ్యంగా దూషిస్తారు. అధికారంలోకి వచ్చాక నీతులు చెబుతారు. జేసీ సోదరులు, వర్ల రామయ్య, చింతమనేని వీళ్లంతా ప్రజాప్రతినిధులేనా?. 

ఈ కల్చర్‌ ఏంటండీ?
ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రమాద ఘటన స్థలానికి వెళ్తే అక్కడ టీడీపీ నేతలు డౌన్‌ డౌన్‌ అంటారా? ఏంటండి ఈ కల్చర్‌. రోజా కోర్టుకు వెళ్తే అక్కడ వ్యతిరేకంగా నినాదాలు చేస్తారా? ఆడలేక మధ్యలో ఓడ అన్నట్లుగా ప్రజల మెప్పు పొందలేక ప్రతిపక్ష నేతపై నిందలు మోపుతున్నారు. మీలాంటి పిచ్చి కేసులకు భయపడే వ్యక్తి వైయస్‌ జగన్‌ కాదు. టీడీపీ, కాంగ్రెస్‌ కలిసి కుట్రలు చేసినా భయపడలేదు. మీ తప్పుడు వ్యాఖ్యలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. రాష్ట్రంలో దుర్మార్గమైన కార్యక్రమాలకు తెర లేపారు. జేసీ బ్రదర్స్‌కు సవాల్‌ చేస్తున్నాను. ఎంపీ, ఎమ్మెల్యేలైనా మీరు కూడా ధర్నాలు చేస్తారా?మీకు బుద్ధిందా? ఇవాళ నిజంగా అరెస్టు చేయవల్సింది జేసీ సోదరులనే. 11 మంది నిండు ప్రాణాలను కోల్పొవడానికి జేసీ బస్సులు ఫిట్‌నెస్‌ లేకపోవడమే ప్రమాదానికి కారణం. ఈ అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనా, జేసీ బ్రదర్స్‌పైనా ఉంది. ఈ 11 మంది కూడా ప్రమాద మరణాలు కాదు. జేసీ సోదరులు చేసిన హత్యలుగానే భావించాల్సి వస్తోంది. శాసన సభలో అంతకు ముందు ఎలాగు వ్యవహరించారో చూశాం. రోజాను ఏడాది పాటు సస్పెండ్‌ చేశారు. మళ్లీ రాకుండా అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారు. మీ రాక్షస పాలనను అంతం చేసేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారు. పిచ్చి పిచ్చి మాటలు, బూతులు మాట్లాడం సరికాదు. ఇలాగే మాట్లాడుతూపోతే చివరకు భస్మాసురహస్తం లాగా మీరు భస్మమైపోతారని టీడీపీ నేతలను అంబటి రాంబాబు హెచ్చరించారు.
Back to Top