`నారాయ‌ణ‌`పై చ‌ర్య‌లు తీసుకోవాలి

చిత్తూరుః అమాయ‌క విద్యార్థుల ప్రాణాలు బ‌లిగొంటున్న నారాయణ విద్యాసంస్థలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  విద్యార్థి విభాగం ఆధ్వ‌ర్యంలో ప‌ల‌మ‌నేరు పట్టణంలోని నారాయణ పాఠశాల వద్ద ధర్నా నిర్వహించారు. మంత్రి నారాయణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వైయ‌స్ఆర్ సీపీ విద్యార్థి విభాగం నాయ‌కుడు కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ విజయవాడలో అనుమానాస్పదంగా మృతిచెందిన విద్యార్థి ఈశ్వర్‌రెడ్డి ఘటనపై సిట్టింగ్‌ జడ్జిచే విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. నారాయణ విద్యాసంస్థల్లో ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నా సీఎం ప‌ట్టించుకోక‌పోవ‌డం దుర్మార్గ‌మ‌ని మండిప‌డ్డారు. నారాయ‌ణ చంద్ర‌బాబు కెబినెట్‌లో మంత్రి కావడం, విద్యాశాఖమంత్రి గంటా ఆయనకు వియ్యంకులు కావడంతో ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. నారాయ‌ణ క‌ళాశాల‌ల్లో జ‌రుగుతున్న ఆత్మ‌హ‌త్య‌ల‌పై వైయ‌స్ఆర్ సీపీ పోరాటం చేస్తుంద‌ని హెచ్చ‌రించారు. కార్య‌క్ర‌మంలో విద్యార్థి నాయకులు నాగేందర్‌ రెడ్డి, అస్పత్త, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top