అక్రమ గ్రావెల్‌ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలి

వెంకటాచలం: అమాయకుల భూముల్లో రైల్వే గుత్తేదారులు అక్రమంగా గ్రావెల్‌ తవ్వకాలు చేపట్టడంపై రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు డిమాండ్‌ చేశారు. జెడ్పీటీసీ మందల వెంకటశేషయ్య ఆధ్వర్యంలో సోమవారం వైయస్‌ఆర్‌ సీపీ నాయకులు తహశీల్దార్‌ సోమ్లా నాయక్‌కు పొలం బాధితుడు బూదూరు వెంకయ్యచేత వినతిపత్రం ఇప్పించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ వెంకయ్య కూతరు ఆరోగ్యం సరిలేకపోవడంతో ఆసుపత్రిలో ఉండగా రైల్వే గుత్తేదారులు కసుమూరులోని వెంకయ్య పొలంలో గ్రావెల్‌ అక్రమంగా తరలించారని  తెలియజేశారు. సర్వే నెం.555లో వెంకయ్యకు మొత్తం 3ఎకరాలు పొలం ఉండగా రైల్వే లైను నిర్మాణానికి కొంత పొలం పోగా మిగతా 1.60ఎకరాల భూమిలో రైల్వే లైనుకు గ్రావెల్‌ తరలించడంతో పొలం గుంతలను తలపిస్తున్నాయన్నారు. బాధితుడు రైల్వే గుత్తేదారులను ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం లేదని విచారణ జరిపి వెంకయ్యకు న్యాయం చేయాలని కోరారు. లేదంటే రైల్వే నిర్మాణ పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సీపీ జిల్లా కార్యదర్శి కనుపూరు కోదండరామిరెడ్డి, మండల ఉపాధ్యక్షులు శ్రీధర్‌నాయుడు, పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి వెలిబోయిన వెంకటేశ్వర్లు, అరుగుంట ప్రభాకర్‌రెడ్డి, మండల కోఆప్షన్‌సభ్యులు హుస్సేన్, వెంకటరమణయ్య, జనార్థన్, ఎస్సీసెల్‌ జిల్లా నాయకులు అడపాల ఏడుకొండలు, పైనం నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

Back to Top