దివాక‌ర్ ట్రావెల్స్‌పై చ‌ర్య‌లు తీసుకోవాలి

గాలివీడు : వైయ‌స్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేసి దివాకర్‌ ట్రావెల్స్‌పై చర్యలు తీసుకోవాలని మండల వైయ‌స్‌ఆర్‌సీపీ అధ్యక్షులు ఆవుల నాగభూషణంరెడ్డి, నాయకులు తంగాల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. వైయ‌స్ఆర్ జిల్లా గాలివీడు మండ‌లంలో గురువారం తహశీల్దార్ కార్యాల‌యం ముందు నిర‌స‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బస్సు ప్రమాదంలో జరిగిన అనంతరం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాదస్ధలానికి చేరుకొని బాధితులక అండగా నిలబడే క్రమంలో బస్సు డ్రైవర్‌కు పోస్టుమార్టం చేయకుండా తరలించేందుకు ప్రయత్నించడంతో అక్కడే ఉన్న అధికారులు, వైద్యులు వాకబు చేసి మృతదేహాలకు కనీసం పోస్టుమార్టం చేయకుండా ఎలా తరలిస్తారని నిలదీశార‌న్నారు. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి అధికారులు ప్రభుత్వ అండతో పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మీద అక్రమణ కేసును నమోదు చేయడం దారుణ‌మ‌న్నారు. టీడీపీ రాక్షస పాలనకు నిరసనగా మండలంలో ఉన్న వైయ‌స్‌ఆర్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు వినతపత్రం కార్యక్రమంలో పాల్గొన్నారు.  నాయకులు సత్యారెడ్డి, బాబురెడ్డి, రాజేష్, చెన్నాకేశవరెడ్డి, రమణారెడ్డి, కోఆఫ్షన్‌ నెంబర్‌ మహ్మద్‌సాహెబ్, సర్పంచ్‌లు ఉమాపతిరెడ్డి, కంచంరెడ్డి, ప్రసాద్‌రెడ్డి, భానుమూర్తిరెడ్డి, ధనుంజయ్యరెడ్డి, పలువురు వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 

Back to Top