ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి

వేమూరు: ప్రజాస్వామ్యం విలువలు కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని వైయ‌స్ఆర్ సీపీ ఎస్సీ సెల్ అధ్య‌క్షుడు మేరుగు నాగార్జున  అన్నారు. శుక్రవారం వేమూరు తహశీల్దారు కార్యాలయంలో ఫిరాయింపుదారుల‌కు మంత్రి ప‌ద‌వులు కేటాయించ‌డంపై కేంద్ర జోక్యం చేసుకొని చంద్ర‌బాబుపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.  సేవ్ డెమోక్ర‌సీ పేరుతో తహశీల్దారు కార్యాలయం వద్ద ఉదయం  మేరుగు నాగార్జున ఆధ్వ‌ర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజ్యాంగానికి విరుద్ధంగా వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారని మండిప‌డ్డారు. వారితో రాజీనామా చేయించి ఎన్నిక‌ల్లోకి పంపించే ధైర్యం చంద్ర‌బాబుకు లేద‌న్నారు.  ధ‌ర్నా కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్ సీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు. 

Back to Top