కార్పొరేట్ విద్యాసంస్థ‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలి

విశాఖ‌: వేస‌వికాలంలో త‌ర‌గ‌తులు నిర్వ‌హిస్తూ విద్యార్థుల‌ను ఇబ్బందుల‌కు గురిచేస్తున్న కార్పొరేట్ క‌ళాశాల‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నాయ‌కులు ఫిర్యాదు చేశారు. విశాఖ జిల్లా ఆర్డీవో కార్యాల‌యానికి భారీ ర్యాలీగా త‌ర‌లివెళ్లి ఆర్డీవోకు ఫిర్యాదును అందజేశారు. ఎండ‌లు మండుతున్నా.. స్పెష‌ల్ క్లాస్‌ల పేరుతో కార్పోరేట్‌, ప్రైవేట్ స్కూల్స్‌, కాలేజీలు విద్యార్థుల‌ను ఇబ్బందుల‌కు గురిచేస్తున్నాయ‌న్నారు. త‌క్ష‌ణ‌మే అట్టి విద్యాసంస్థ‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. 

Back to Top