చిత్తూరు కలెక్టర్‌పై చర్యలు తీసుకోవాలి

ఏపీ అసెంబ్లీ: తిరుపతిలో అన్యాక్రాంతమైన భూమిపై తప్పుడు నివేదిక ఇచ్చిన కలెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. బుధవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో భూముల అన్యాక్రాంతంపై చెవిరెడ్డి మాట్లాడారు. తిరుపతి రూరల్‌ మండలంలో ఒక చోట 139.4 ఎకరాలు, మరో చోట 789.8 ఎకరాల్లో ఆక్రమించుకున్నారని, అయితే ఈ విషయంలో  కలెక్టర్‌ తప్పుడు నివేదికలు ఇచ్చారని, ఇదే విషయంలో తహశీల్దార్‌ వాస్తవాలు వెల్లడించారని సభ దృష్టికి తీసుకొచ్చారు. తప్పుడు నివేదికలు ఇచ్చిన కలెక్టర్‌పై చర్యలు తీసుకోవాలి. ఓ కమిటీ ఏర్పాటు చేసి నిజానిజాలు వెల్లడించాలని చెవిరెడ్డి కోరారు.

Back to Top