వైయ‌స్ జ‌గ‌న్ సీఎం కావాల‌ని మోకాళ్ల‌పై అప్ప‌న్న కొండ‌కు

 
 విశాఖపట్నం: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని సింహాద్రి అప్పన్న కొండ మెట్లు మోకాళ్లతో ఎక్కుతానని నర్సీపట్నానికి చెందిన లాలం సత్యనారాయణ మొక్కుకున్నారు.  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుటుంబానికి వీరాభిమాని అయిన స‌త్య‌నారాయ‌ణ వైయ‌స్ఆర్‌ హయాంలో జరిగిన సంక్షేమ పథకాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. మ‌హానేత‌ తనయుడు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలు పథకాలకు ముగ్దుడయ్యారు. దీంతో ఆయా పథకాలపై షార్ట్‌ఫిలింను రూపొందించాలని సంకల్పించాడు. ఆయా షార్ట్‌ఫిలిం కాన్సెప్ట్‌ను పోస్టర్లుగా వేసి జిల్లాలో జరుగుతున్న ప్రజాసంకల్పయాత్రలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.  వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక నవరత్నాలు పేదలకు ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నాడు.


Back to Top