హైకోర్టు ఆదేశాలు బాబుకు చెంపపెట్టు

-స‌దావ‌ర్తి స‌త్రం భూములపై హైకోర్ట్ లో టీడీపీకి షాక్
- కొనుగోలుదారుల‌కు సేల్ సర్టిఫికేట్ ఇవ్వొద‌ని ఆదేశాలు
- బాబు, లోకేష్, మంత్రులు, ఎమ్మెల్యేలు రూ.1200 కోట్లు లూటీ చేశారు
- వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణ రెడ్డి 

హైద‌రాబాద్‌:  స‌దావ‌ర్తి స‌త్రం భూముల విక్ర‌యాల‌పై ప్ర‌భుత్వానికి హైకోర్టు లో షాక్ తగిలింది. సత్రం భూముల కొనుగోలు దారుల‌కు సేల్ స‌ర్టిఫికెట్ ఇవ్వొద్ద‌ని ఆదేశాలు జారీ చేసింది. స‌దావ‌ర్తి స‌త్రం భూముల అమ్మకాల్లో అవినీతి జ‌రిగింద‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే హైకోర్టులో పిటిష‌న్ వేసిన విష‌యం విధిత‌మే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న హైకోర్టు తీర్పును ఉద్దేశించి స్థానిక విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ... సీఎం చంద్ర‌బాబుకు హైకోర్టు తీర్పు చెంప‌పెట్టు అన్నారు. సత్రం భూములు ఎక‌రం సుమారు రూ. 7కోట్లు రిజిస్ట‌ర్డ్ విలువ ఉందంటూ స‌ర్టిఫై చేస్తూ చెన్నైలో రెవెన్యూ అధికారులు స‌ర్టిఫికెట్లు జారీ చేశార‌ని ఆర్కే పేర్కొన్నారు. జాయింట్ క‌మిష‌న‌ర్, ఎండోమెంట్ వారు సైతం ఇది రూ. 7కోట్లు ఉంద‌ని దీనిని త‌క్కువ‌కు అమ్మ‌వ‌ద్దని  ప్ర‌భుత్వానికి లేఖ రాసిన‌ప్ప‌టికి దానిని సీఎం ప‌క్క‌న పెట్టార‌న్నారు. 

ఎక‌రం కేవ‌లం రూ. 26 ల‌క్ష‌ల‌కు అమ్మి బాబు ఏస్థాయిలో అవినీతికి పాల్ప‌డుతున్నారో ప్ర‌జ‌లంద‌రికీ అర్థ‌మ‌వుతుంద‌న్నారు. గ‌తంలో సైతం చంద్ర‌బాబు హైకోర్టులో త‌న మ‌నుషుల‌తో మెటిరీయ‌ల్ లేకుండా కేసు వేయించ‌డం జ‌రిగింద‌ని, దాన్ని హైకోర్టు కొట్టివేసిందని తెలిపారు. తాము పూర్తిస్థాయి మెటిరియ‌ల్‌తో కేసు వేశామ‌ని, దానిని న్యాయస్థానం ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. 

పరాకాష్టకు టీడీపీ అవినీతి
రూ. 26 ల‌క్ష‌ల‌కు ఎక‌రాన్ని అమ్మ‌డం దారుణ‌మ‌ని, సేల్ స‌ర్టిఫ‌కెట్‌ను ఎవ్వ‌రికి ఇవ్వొద్ద‌ని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింద‌న్నారు. రెండు వారాల్లో కౌంట‌ర్‌ను దాఖలు చేయాల‌ని ప్ర‌భుత్వానికి మొట్టికాయ వేసింద‌న్నారు. స‌దావ‌ర్తి భూముల అవినీతిలో చంద్రబాబు స‌హా టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల‌కు  ప్ర‌మేయం ఉంద‌ని, వారికి ఇది ఒక చెంప‌పెట్ట‌న్నారు.  దేవుడికి దూప‌, దీప‌, నైవేద్యాల కోసం మ‌హానుభావులు ఇచ్చిన భూముల్లో సుమారు 83 ఎక‌రాలు మాత్ర‌మే మిగిలాయ‌ని, కనీసం ఈ భూములనైనా పేద బ్ర‌హ్మ‌ణుల కోసం వినియోగించాల‌న్నారు. స‌దావ‌ర్తి భూముల్లో చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు లోకేష్‌, టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు సుమారు రూ. 1200కోట్ల‌ను లూటీ చేసేందుకు కుట్ర‌లు ప‌న్నార‌ని ఆయ‌న ధ్వ‌జమెత్తారు. 
Back to Top