ఏపీ సర్కార్ కు హైకోర్టులో షాక్

సదావర్తి సత్రం భూముల వేలం కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్ తగలింది. కొనుగోలుదారులకు సేల్ సర్టిఫికెట్ ఇవ్వొద్దని న్యాయస్థానం ఆదేశించింది. ఇందుకు సంబంధించి రెండు వారాల్లో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కొందరికి లబ్ధి చేకూర్చేందుకు మార్కెట్ విలువ కంటే తక్కువగా భూములు విక్రయించారంటూ మంగళగిరి వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. మరోవైపు హైకోర్టు ఆదేశాలను ఎమ్మెల్యే ఆర్కే స్వాగతించారు. సత్రం భూముల అమ్మినవారికి తక్షణమే సేల్ సర్టిఫికెట్ ఇవ్వరాదని కోర్టు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. దేవుడ్ని కూడా చంద్రబాబు లెక్క చేయటం లేదని ఆయన అన్నారు.

Back to Top