నూత‌న వ‌ధూవ‌రుల‌కు ఆశీర్వాదం

ద‌ర్శిః వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌కాశం జిల్లా ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద‌రెడ్డి నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. ఒంగోలులో జ‌రిగిన వాకా సుబ్బారెడ్డి మ‌న‌వ‌రాలి వివాహానికి హాజ‌రై నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. అదే విధంగా ద‌ర్శి మండ‌లంలోని కొత్త‌రెడ్డిపాలెంలో పార్టీ కార్య‌క్ర‌ర్త చెల్లిలి వివాహానికి హాజ‌ర‌య్యారు. అనంత‌రం తాళ్లూరు మండ‌లం బోధికూర‌పాడులో పార్టీ నాయ‌కులు పులి ప్ర‌సాద‌రెడ్డి సోద‌రి వివాహానికి హాజ‌ర‌య్యారు. అదే విధంగా ద‌ర్శి సాగ‌ర్ కాలువ‌పై నూత‌నంగా నిర్మిస్తున్న పోలేర‌మ్మ టెంపుల్ ప‌నుల‌ను ప‌రిశీలించారు. గుడి అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌పై నిర్వాహ‌కుల‌ను అడిగి తెలుసుకున్నారు. 

Back to Top