వైయస్సార్సీపీలో చేరిన శిల్పామోహన్ రెడ్డి

హైదరాబాద్ః కర్నూలు జిల్లా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి వైయస్సార్సీపీలో చేరారు. వైయస్సార్సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ సమక్షంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో శిల్పా తన అనుచరులతో కలిసి పార్టీలో చేరారు. వైయస్ జగన్ వీరందరికీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. శిల్పా మోహన్ రెడ్డితో పాటు నంద్యాల మున్సిపల్ చైర్ పర్సన్ సులోచన, మార్క్ ఫెడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిపి  నాగిరెడ్డి, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు వైయస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ నాయకత్వం వర్థిల్లాలంటూ శిల్పా అనుచరులు నినాదాలు చేశారు.

Back to Top