పాదయాత్రకు కర్నూలులో అనూహ్య స్పందన

పాదయాత్రకు కర్నూలులో అనూహ్య స్పందన
సెల్ఫీలు, కరచాలనం చేసేందుకు యువత ఉత్సాహం
పొలాల్లోంచి పరిగెత్తుకుంటూ వస్తున్న రైతులు, కూలీలు
వైయస్‌ జగన్‌ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది
వైయస్‌ఆర్‌ సీపీ సీనియర్‌ నేత శిల్పా మోహన్‌రెడ్డి

కర్నూలు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు కర్నూలు జిల్లాలో విపరీతమైన స్పందన లభిస్తున్నదని పార్టీ సీనియర్‌ నేత శిల్పా మోహన్‌రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లాలో పాదయాత్ర ఆఖరి రోజు జోరుగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా శిల్పా మోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైయస్‌ జగన్‌ను కలిసి తమ బాధలను చెప్పుకునేందుకు ప్రజలంతా పొలాల్లోంచి, పనులు వదులుకొని పరిగెత్తుకుంటూ వస్తున్నారని చెప్పారు. అన్నను కలవాలని, కరచాలనం చేయాలని, సెల్ఫీలు దిగాలని యువత తరలివస్తున్నారన్నారు. వైయస్‌ జగన్‌తో కలిసి నడిచేందుకు జనం తండోపతండాలుగా తరలివస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీపై ఉన్న వ్యతిరేకత, వైయస్‌ జగన్‌పై ఉన్న నమ్మకం రెండు వైయస్‌ఆర్‌ సీపీని అధికారంలోకి రావడానికి ఉపయోగపడతాయన్నారు. 

ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతూ.. ప్రతి జిల్లాలో తిరుగుతున్న వైయస్‌ జగన్‌కు ప్రజల ఆశీర్వాదం లభిస్తుందని శిల్పా మోహన్‌రెడ్డి దీమా వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలో ప్రధానంగా ఇరిగేషన్‌ సమస్యలు వైయస్‌ జగన్‌ దృష్టికి వచ్చాయన్నారు. గుండ్రేవుల, సిద్ధేశ్వరం, తెలుగుగంగ, కేసీకెనాల్, గురురాఘవేంద్ర, గాలేరు–నగరి ప్రాజెక్టులు పూర్తి చేయాలని వైయస్‌ జగన్‌ను ప్రజలు, రైతులు కోరారన్నారు. వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్టులు పూర్తి చేస్తానని, మళ్లీ రాష్ట్రాన్ని అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతానని వైయస్‌ జగన్‌ ప్రజలకు హామీ ఇచ్చారన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి మాదిరిగానే వైయస్‌ జగన్‌ పరిపాలన చేసి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటారని ఆకాంక్షించారు. 
Back to Top