శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డి రాజీనామా చేయ‌డం హ‌ర్ష‌నీయం

క‌ర్నూలు: శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డి టీడీపీ ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేసి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర‌డం అభినందించ‌ద‌గ్గ విష‌య‌మ‌ని అబ్దుల్లాపురం గ్రామానికి చెందిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌పార్టీ నాయ‌కుడు వంగాల నాగేశ్వ‌ర‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి నైతిక విలువలు ఉన్న వ్యక్తి అని, నీతిమంతమైన రాజకీయాలకు ఆయనే నిద‌ర్శ‌న‌మ‌న్నారు. డబ్బు , పదవులు, కాంట్రాక్టులను ఎరవేసి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకున్న చంద్రబాబుకు చక్రపాణిరెడ్డి రాజీనామా చెంపపెట్టు అని పేర్కొన్నారు.

Back to Top