కేంద్ర సంస్థల తరలింపు తగదు..గుడివాడ అమర్

విశాఖపట్నం)) కేంద్ర
ప్రభుత్వ విద్యాసంస్థల్ని విశాఖ జిల్లాలో ఏర్పాటు చేస్తున్నామని ఊరించి, ఇతర
ప్రాంతాలకు తరలించటం తగదని వైయస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్
నాథ్ అభిప్రాయ పడ్డారు. విశాఖపట్నంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో
మాట్లాడారు. ఇండియన్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజిమెంట్ ను మొదటగా
అనకాపల్లి లో ఏర్పాటు చేస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. ఇప్పుడు దాన్ని
క్రిష్ణా జిల్లా కొండపల్లి కి తరలించటం ఎంత వరకు భావ్యమని ప్రశ్నించారు. గతంలో
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆప్ ఫారిన్ ట్రేడ్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లానింగ్
లను కూడా ఇలాగే తరలించారని పేర్కొన్నారు.  ఉత్తరాంధ్ర
జిల్లాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. పార్టీ నాయకులు దైనాల
విజయక్ కుమార్, సత్తి రామక్రిష్ణా రెడ్డి, జాన్ వెస్లీ, రవి రెడ్డి, రెయ్యి వెంకట
రమణ, బర్కత్ అలీ, బోని శివరామక్రిష్ణ, సిర్తాల వాసు, బయ్యవరపు రాధా, షరీఫ్
పాల్గొన్నారు. 

Back to Top