షర్మిల యాత్రకు మద్దతుగా బైక్ ర్యాలీ

హైదరాబాద్, 6 ఫిబ్రవరి 2013: దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల బుధవారం పునఃప్రారంభంకానున్న పాదయాత్రకు రాష్ట్ర నలుమూలల నుండి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రంగారెడ్డి జిల్లాలోని తుర్కయాంజాలో యువకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. శ్రీమతి షర్మిల అక్కడికి చేరుకున్నప్పుడు స్థానిక మహిళలు మంగళహారతులు పట్టి స్వాగతం పలికారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి వందలాది మంది విద్యార్థులు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పలువురు ముస్లిం పెద్దలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. రంగారెడ్డి జిల్లా నుంచే కాకుండా తెలంగాణలోని ఇతర జిల్లాల నుండి వందలాది మంది రైతులు తుర్కయాంజాల్ తరలి వచ్చి మహానేతపై ఉన్న తమ అభిమానాన్ని చాటుకున్నారు. శ్రీమతి షర్మిల తుర్కయాంజాల్ చేరుకోవడానికి ముందు పార్టీ సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో అక్కడ నిర్వహించిన ఆటా, పాటా కార్యక్రమం జనం కేరింతలతో హోరెత్తింది.

Back to Top