షర్మిల యాత్ర ఆరంభం

విజయవాడ, 29 మార్చి 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ కుమార్తె, వైయ్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల 105వ రోజు మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర కృష్ణా జిల్లాలో ఘనంగా సాగుతోంది. ప్రజాసమస్యలపై అలుపెరగని పోరాటానికి దిగిన రాజన్న బిడ్డను జిల్లా ప్రజలు అక్కున చేర్చుకుంటున్నారు. శ్రీమతి షర్మిల శుక్రవారం 105వ రోజు పాదయాత్రను పడమటలంక నుంచి ప్రారంభించారు. తొలుత ఎన్టీఆర్ సర్కిల్, ఆటోనగర్ గేట్ మీదుగా వెళ్లి కామయ్యతోపులో రచ్చబండ నిర్వహిస్తారు. భోజన విరామం అనంతరం పోరంకి మీదుగా పెనమలూరు వెడతారు. అక్కడ రచ్చబండలో పాల్గొంటారు. గంగూరు క్రాస్‌రోడ్డు, ఈడుపుగల్లు క్రాస్‌రోడ్డు మీదుగా సాగి రాత్రికి గోసాలలో బస చేస్తారు.

Back to Top