రంగారెడ్డిలో ముగిసిన షర్మిల పరామర్శ యాత్ర

హైద‌రాబాద్‌: వైఎస్సార్‌సీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ ఇచ్చిన మాట మేరకు ఆయ‌న సోద‌రి వైఎస్ ష‌ర్మిల చేప‌ట్టిన ప‌రామ‌ర్శ యాత్ర రంగారెడ్డి జిల్లాలో ముగిసింది. నాలుగు రోజుల పాటు సాగిన ఈ యాత్రలో ష‌ర్మిల 590 కిలోమీటర్ల మేర ప‌ర్య‌టించారు. 7 నియోజ‌క వ‌ర్గాల్లోని 15 కుటుంబాల్ని ఆమె ప‌రామ‌ర్శించారు. మోమిన్ పేట లోని అరిగె యాద‌య్య‌, ఎల్క‌త‌ల లోని ఆలంప‌ల్లి వెంక‌టేశం కుటుంబాల్ని ష‌ర్మిల ప‌రామ‌ర్శించారు. రాజ‌న్న బిడ్డ త‌మ లోగిళ్ల‌కు వ‌చ్చింద‌న్న అభిమానం ఆయా కుటుంబ స‌భ్యుల్లో వ్య‌క్తం అయింది. ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఆక‌స్మిక మ‌ర‌ణంతో దిగాలు చెంది ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల్ని ప‌రామ‌ర్శిస్తాన‌ని ఆనాడు వైఎస్ జ‌గ‌న్ ప్ర‌కటించారు. ఈ మేర‌కు ఆయ‌న పలు జిల్లాల్లో ఓదార్పు యాత్ర చేశారు. త‌ర్వాత ఆయ‌న మాట మేర‌కు వైఎస్ ష‌ర్మిల ప‌రామ‌ర్శ యాత్ర చేప‌ట్టారు. మ‌హ‌బూబ్ న‌గ‌ర్, న‌ల్ల‌గొండ జిల్లాల్లో ప‌ర్య‌టించిన వైఎస్ ష‌ర్మిల తాజాగా రంగారెడ్డి జిల్లాలో యాత్ర పూర్తి చేశారు.
Back to Top