షర్మిల పాదయాత్రపై పార్టీ నల్గొండ నేతల భేటి

హైదరాబాద్, 3 ఫిబ్రవరి 2013: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల కొద్ది రోజుల్లో మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర పునః ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వైయస్‌ఆర్‌సిపి కేంద్ర కార్యాలయంలో ఆదివారంనాడు నల్గొండ జిల్లాకు చెందిన పార్టీ నాయకులు భేటీ అయ్యారు. రంగారెడ్డి జిల్లాలో మళ్ళీ ప్రారంభమయ్యే శ్రీమతి షర్మిల పాదయాత్ర త్వరలోనే నల్గొండ జిల్లాలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో వారి భేటి ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ సమావేశంలో శ్రీమతి షర్మిల పాదయాత్ర రూట్ మ్యా‌ప్, ప్రణాళిక తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి‌ వైయస్‌ఆర్‌సిపి నల్గొండ జిల్లా కన్వీనర్ బీరవోలు సోమిరెడ్డి‌, తదితరులు హాజరయ్యారు.
Back to Top