శ్రీమతి షర్మిల పాదయాత్రకు విశేష స్పందన

దేవరకద్ర:

వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైnస్ జగన్మోహన్‌ రెడ్డి సోదరి శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు జిల్లాలో విశేష స్పందన లభిస్తోందని ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు వి. బాలమణెమ్మ చెప్పారు. పాదయాత్ర ఏర్పాట్లపై సమావేశం సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. షర్మిల పాదయాత్రతో కాంగ్రెస్, టీడీపీ నేతల గుండెల్లో గుబులు ప్రారంభమైందన్నారు. ఆ పార్టీలపై ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయిందన్నారు. ప్రజలంతా వైయస్‌ఆర్ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారన్నారు. జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రయితే రాజన్న రాజ్యం తథ్యమన్నారు. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై జగన్‌ను జైల్లో పెట్టించాయని ఆరోపించారు. ఆ రెండు పార్టీల మ్యాచ్‌ఫిక్సింగ్‌ను ప్రజలు గమనించి సరైన సమయంలో వారికి తగిన విధంగా బుద్ధి చెబుతారన్నారు. వచ్చేనెల 3న షర్మిల పాదయాత్ర దేవరకద్రకు చేరుతుందన్నారు. అదేరోజు రాత్రి మన్యంకొండ సమీపంలోని కాకతీయ ప్రైవేట్ పాఠశాలలో షర్మిల బస చేస్తారని చెప్పారు.

Back to Top