షర్మిల పాదయాత్ర ఆరంభం

అనంతపురం :

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర మంగళవారం నాడు ఇరవయ్యో రోజుకు ప్రవేశించింది. ఉదయం పదకొండు గంటలకు అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూరు నుంచి పాదయాత్ర  ప్రారంభమైంది. ఆమె మంగళవారం నాడు  దాదాపుగా 12 కిలోమీటర్లు నడుస్తారు. కమలపాడు, గుల్యాపాలెం, కొనకండ్ల వరకు పాదయాత్ర చేసి రాత్రికి అక్కడే బస చేస్తారు.

Back to Top