షర్మిలను కలిసిన సుభాష్ చంద్రబోస్

కంకిపాడు, 30 మార్చి 2013:

విద్యుత్తు సమస్యలపై పోరాడే హక్కు టీడీపీకి లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టంచేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. పాదయాత్రలో ఉన్న శ్రీమతి షర్మిలను ఆయన శనివారం కలిశారు. రిలయన్సు సంస్థకు మన గ్యాస్ నిక్షేపాలను కట్టబెట్టింది చంద్రబాబేననీ, దీనివల్ల ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావు లబ్ధిపొందారని ఆయన వివరించారు. రాష్ట్రం తీవ్ర సమస్యల్లో కూరుకుపోయి ఉంటే మంత్రులు విదేశీ పర్యటనలు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

Back to Top