షర్మిలమ్మకు సమస్యల మొర

నిడమానూర్ (నాగార్జునసాగర్)15 ఫిబ్రవరి 2013:

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నిడమానూర్ గ్రామం శుక్రవారం మధ్యాహ్నం జనంతో కిటకిటలాడిపోయింది. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సో దరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల రాకతో గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. సమస్యలు చెప్పుకున్నారు. రోడ్డు లేదనీ, మంచి నీటి సరఫరా లేదనీ మొరపెట్టుకున్నారు.  ప్రస్తుత ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేసే మనసు లేదని శ్రీమతి షర్మిల వారితో అన్నారు. మీ నియోజకవర్గ ఎమ్మెల్యే జానారెడ్డి మంత్రి కూడా అయినప్పటికీ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అలాంటి మంత్రి ఉంటే ఎంత లేకపోతే ఎంతని ప్రశ్నించారు. కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయని ఓ మహిళ ఫిర్యాదు చేశారు. కొన్నాళ్ళు ఓపికపడితే జగనన్న ముఖ్యమంత్రి అవుతారనీ, మీ కష్టాలన్నీ తీరుస్తారనీ ఆమె వారికి భరోసా ఇచ్చారు.

ఇలా ఉండగా గురువారం హాలియాలో నిర్వహించిన సభలో ప్రజలు కిటకిటలాడిపోయారు. యువతీయువకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. శ్రీమతి షర్మిలతో కరచాలనానికి పోటీ పడ్డారు. ఫొటోలు దిగడానికి బారులు తీరారు. శ్రీమతి షర్మిల ఓపికగా వారు చెప్పింది వింటూ, చేతిలో చేయి వేస్తూ ముందుకుసాగారు.

Back to Top