షర్మిలకు వేద పండితుల ఆశీర్వచనం

విజయవాడ, 28 మార్చి 2013:

అన్ని కులాలూ, అన్ని మతాల ప్రజలూ బాగుండాలని మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ఆకాంక్షించారని బ్రాహ్మణులు తెలిపారు. ప్రజలకు ఎనలేని సేవలందించిన వైయస్ఆర్ కుటుంబం దీర్ఘకాలం రాష్ట్రాన్ని ఏలాలన్నారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర     104వ రోజు సందర్భంగా వారు శ్రీమతి వైయస్ షర్మిలను కలిసి ఆశీర్వదించారు. వేదమంత్రోచ్చరణ చేశారు. శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని వారు స్పష్టంచేశారు. బ్రాహ్మణ కులానికి మహానేత రాజశేఖరరెడ్డి చక్కటి సేవలందించారని చెప్పారు. మరుగున పడిన దేవాలయాలలో ధూప,దీప సేవలకు నెలనెలా రూ. 2500 ఇచ్చారని తెలిపారు. ఆయన ముఖ్యమంత్రి కాగానే కరణాల వ్యవస్థను పునరుద్ధరించి మేలు చేశారని పేర్కొన్నారు. రాజశేఖరరెడ్డి కుటుంబం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఎక్కువ కాలం పాలించాలని కోరుతున్నామన్నారు. మహానేతపై ఉన్న అభిమానంతో ఇక్కడికొచ్చి, పాదయాత్ర దిగ్విజయంగా సాగాలని ఆశీర్వదించామన్నారు.

Back to Top