<strong>మంగళగిరి (గుంటూరుజిల్లా), </strong>24 మార్చి 2013: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, జననేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆదివారానికి 100వ రోజుకు చేరింది. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో శ్రీమతి షర్మిల నేడు పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పలువురు నాయకులు శ్రీమతి షర్మిలకు స్వయంగా కలిసి అభినందనలు తెలిపారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి శ్రీమతి షర్మిలను కలుసుకుని, సంఘీభావం ప్రకటించారు. వంద రోజుల పాదయాత్ర పూర్తిచేసిన శ్రీమతి షర్మిలను వారు ప్రత్యేకంగా అభినందించారు.