షర్మిలకు గుంతకల్లులో బ్రహ్మరథం

గుంతకల్లు :

మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిలకు గుంతకల్లు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా స్థానిక హనుమాన్ సర్కిల్ నుంచే వేలాదిమంది ప్రజలు ఆమె వెంట నడిచారు. హనుమాన్ సర్కిల్లో వైఎస్ఆర్ విగ్రహానికి షర్మిల పూలమాల వేసి నివాళులర్పించారు. 21వ రోజు పాదయాత్రలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత పాల్గొన్నారు. షర్మిల పాదయాత్ర బీరప్ప సర్కిల్, పాత గుంతకల్లు, వాల్మీకి సర్కిల్, మార్కెట్‌యార్డు, కథల గేరి, ఆర్టీసీ బస్టాండ్, అజంతా సర్కిల్, మెయిన్ బజార్, ధర్మవరం గేట్ రోడ్, మండి సర్కిల్, గాంధీ సర్కిల్, ఓల్డు గుత్తి రోడ్డు, కసాపురం రోడ్డు, సత్యనారాయణపేట మీదుగా కొనసాగనుంది. పట్టణంలోని అజంతా సర్కిల్‌లో బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తారన్నారు. రాత్రికి కసాపురం రహదారిలో అయ్యప్పస్వామి ఆలయం వద్ద  బస చేస్తారు. గురువారం కసాపురం మీదుగా నంచర్ల వంతెన దాటాక కర్నూలు జిల్లా మద్దికెర మండలంలోకి పాదయాత్ర ప్రవేశిస్తుంది.

Back to Top