షర్మిలకు గోడు వెళ్ళబోసుకున్న మామిడి రైతులు

విజయవాడ, 22 ఏప్రిల్ 2013:

ఈదురు గాలులతో దెబ్బతిన్న మామిడి తోటలను శ్రీమతి వైయస్ షర్మిల సోమవారం పరిశీలించారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా  128వ రోజు ఆమె షేర్ మహ్మద్ పేట నుంచి పాదయాత్రను పరిశీలించారు. తోటలలో నేలరాలిన మామిడి పండ్ల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. మామిడి పండ్లు అమ్ముకుంటే కూలీల ఖర్చు కూడా వచ్చేటట్లు లేదని రైతులు ఈ సందర్భంగా శ్రీమతి షర్మిల వద్ద   తమ ఆవేదన వెలిబుచ్చారు.  అంతకు ముందు మిరప రైతులు ఆమెను కలుసుకున్నారు. నీళ్లు సమయానికి అందకపోవటంతో అనుకున్న దిగుబడి రాలేదని వారు ఆమెకు తెలిపారు. పెట్టుబడి కూడా చేతికి వచ్చేలా లేవని రైతులు తమ గోడు వినిపించారు.

Back to Top