షర్మిల కృష్ణాజిల్లా పాదయాత్ర పోస్టర్ ఆవిష్కరణ

హైదరాబాద్, 14 మార్చి 2013: కృష్ణా జిల్లాలో శ్రీమతి షర్మిల చేపట్టనున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర పోస్టర్‌ను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ గురువారం విడుదల చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తల కోలాహలం మధ్య లోటస్‌పాండ్‌లోని తమ నివాసంలో ఈ పాదయాత్ర పోస్టర్‌ను శ్రీమతి విజయమ్మ ఆవిష్కరించారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, జననేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల ప్రస్తుతం గుంటూరు జిల్లాలో మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో ఆమె పాదయాత్ర కృష్ణా జిల్లాలోకి ప్రవేశించనున్నది.

కాగా, పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలోనే రాజమండ్రి రూరల్ కాంగ్రె‌స్ ‌నాయకుడు ఆకుల వీర్రాజు, మాజీ కార్పోరేటర్ శ్రీనివాసులు వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీలో చేరారు.
Back to Top