వరంగల్ జిల్లాలో మలివిడత పరామర్శయాత్ర..!

నీ రాక కోసం ..!
ఐదు రోజుల పర్యటన..!

దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైెస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల... వంరగల్ జిల్లాలో మలివిడత పరామర్శ యాత్రకు సిద్ధమయ్యారు.  సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు ఆమె జిల్లాలో పర్యటిస్తారు. మహబూబాబాద్, నర్సంపేట, పాలకుర్తి, పరకాల, భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాల్లో  ఆమె పర్యటిస్తారు.  ఈమేరకు పార్టీ నేతలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. . 
ముగిసిన మొదటి విడత..!
ఈనెల 28న జిల్లాలో షర్మిల  మొదటి విడత పరామర్శ యాత్ర ముగిసిన సంగతి తెలిసిందే. మొత్తం 7 నియోజకవర్గాల్లో 32 కుటుంబాలను షర్మిల పరామర్శించారు. వారి సాధకబాధలను అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటామని బాధితులకు పూర్తి భరోసా ఇచ్చారు. 

తండ్రి బాటలోనే..!
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు తండ్రి అడుగుజాడల్లో నడిచారు. ఓదార్పు యాత్రకు శ్రీకారం చుట్టారు.  వైఎస్ జగన్ బాటలోనే షర్మిల కూడా పయనిస్తున్నారు. 

నీ రాక కోసం..!
షర్మిలమ్మకు అడుగడుగునా తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.  తమ ప్రియతమనేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురుని చూసి ఆనందపారవశ్యులవుతున్నారు. మళ్లీ రాజన్న రాజ్యం రావాలని కోరుకుంటున్నారు.ఇప్పటికే తెలంగాణలో  రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలో షర్మిల పర్యటించారు. వరంగల్ జిల్లాలో మొదటి విడత పరామర్శయాత్రను పూర్తి చేశారు.  బాధితులను ఆదుకునేందుకు మరోసారి ఐదురోజుల పాటు పర్యటనకు వెళ్తున్నారు. శ్రావణమాసంలో తెలంగాణలో అడుగుపెడుతున్న షర్మిలమ్మకు ఘన స్వాగతం పలికేందుకు తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారు. 
Back to Top