పుట్టగుంటలో ప్రజా ప్రస్థాన దశాబ్ది

దివంగత మహానేత డాక్లర్ వైయస్‌ఆర్ ప్రజా ప్రస్థానం ప్రారంభించిన ఏప్రిల్ 9నాటికి పదేళ్ళు పూర్తయిన సందర్భంగా శ్రీమతి షర్మిల కృష్ణా జిల్లా నందివాడ మండలం పుట్టగుంటలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎమ్.వి.ఎస్. నాగిరెడ్డికి చెందిన చేపల చెరువు గట్టుపై రాతి ఉసిరి, మామిడి మొక్కలను నాటారు.  1999 ఎన్నికలలో మహానేత కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ నుంచే ఉచిత విద్యుత్తు వాగ్దానం చేశారు. ఇదే అంశాన్ని శ్రీమతి షర్మిల హనుమాన్ జంక్షన్‌లో ఏర్పాటైన సభలో గుర్తుచేశారు.
కన్నీళ్ళు అబద్ధం చెప్పవు

 రెండో రోజు యాత్రలో శ్రీమతి షర్మిలకు ఓ పిల్లాడు గొర్రెలు కాస్తూ కనిపించాడు. ఆమె అతని వద్దకు వెళ్ళి వివరాలను తెలుసుకున్నారు. పదో తరగతి చదువుతున్నాననీ, తండ్రికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో తనకీ పని తప్పలేదనీ, అన్న జేసీబీమీద పనిచేస్తాడనీ తెలుసుకున్న ఆమె అతడి కన్నీళ్ళు అబద్ధం చెబుతాయా అని అక్కడి ప్రజలను ప్రశ్నించారు.
 
 రాజన్నే బతికించారు
 దుగ్గన్నగారి పల్లె వద్ద ఏరోనాటికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యార్థి శ్రీమతి షర్మిలను కలిశారు. మొదటి సంవత్సరంలో ఉండగా ప్రమాదానికి గురయ్యాననీ, 108అంబులెన్సు వల్ల సకాలంలో ఆస్పత్రికి చేరడంతో  బతికాన న్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద డాక్టర్ రాజశేఖరరెడ్డి ఖర్చులన్నీ భరించారని చెప్పారు.
 
 చెప్పుల్లేకుండా యాత్రలో..
 గుంటూరు జిల్లా రొంపిచర్లకు చెందిన గజ్జల కృష్ణారెడ్డి చెప్పుల్లేకుండా యాత్రలో పాల్గొంటున్నారు. వైయస్ వెంట 500 కి.మీ నడిచినట్టు తెలిపారు. పుట్లూరు మండలం మడుగుపల్లి గ్రామానికి చెందిన బి. నాగేశ్వరరెడ్డి అనే విద్యార్థి శ్రీమతి షర్మిలను కలిసి తనకు ఎంబీఏ చదవాలనుందని అడిగినపుడు ఆమె తప్పకుండా చదివిస్తామని హామీ ఇచ్చారు.
 
 గాయని ఉద్వేగం..
 పాలమూరు జిల్లా లాల్‌కోట గ్రామం వద్ద రమాదేవి అనే గాయని శ్రీమతి షర్మిలను కలిశారు. ‘రాజన్న కూతురు షర్మిలక్కా వచ్చేరా మన పల్లెకు అని ఆమె పాడిన పాట శ్రీమతి షర్మిలను కదిలించింది. తొలుత రమాదేవి రాజన్న తనయను చూసి గుక్కపెట్టి ఏడ్వడం అందరి కంటా నీరు తెప్పించింది.
 
 ఉద్రిక్తతలోనూ.. చెరగని చిరునవ్వు
 పాలమూరు వర్శిటీ వద్ద స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. కొందరు విద్యార్థులు టమోటాలు, కోడిగ్రుడ్లు విసరడంతో తన చుట్టూ రక్షణ కవచంగా నిలిచిన సిబ్బందిని పక్కకు తొలగమని చెప్పారు. చిరునవ్వు చెదరనీయకుండా వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
 
 అప్పుడు తండ్రి వెంట.. ఇప్పుడు తనయ వెంట.. వెంకటయ్య
 మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి మండలం చందాపూర్ మాజీ సర్పంచి. వికలాంగుడు. కర్ర లేనిదే నడవలేడు. వైయస్ దయ వల్లే తాను సర్పంచినయ్యానని చెప్పుకుంటారు. మహానేత చేపట్టిన ప్రజా ప్రస్థానంలో కూడా నడిచానని తెలిపారు.

తాజా ఫోటోలు

Back to Top