షర్మిల పరామర్శయాత్రకి బ్రేక్


హైదరాబాద్: వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డి సోదరి షర్మిల పరామర్శ యాత్ర వాయిదా పడిందని ఆ పార్టీ తెలంగాణ విభాగం  అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈమేరకు ఆయన లోటస్‌పాండ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 18 నుంచి నల్లగొండ జిల్లాలో  ప్రారంభం కావాల్సిన షర్మిల పరామర్శ యాత్ర అనివార్య కారణాల వల్ల వాయిదా వేశామని ఆయన చెప్పారు. పరామర్శ యాత్ర తేదీని మరీ తర్వాత ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.
Back to Top