నిజామాబాద్ లో ముగిసిన తొలివిడత యాత్ర..!

నిజామాబాద్ః దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి తనయ, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల  తొలి విడత పరామర్శయాత్ర నిజామాబాద్ జిల్లాలో ముగిసింది. షర్మిల పర్యటనకు అపూర్వ స్పందన వచ్చింది. ప్రజలు రాజన్నబిడ్డను  అక్కున చేర్చుకొని ఆదరించారు. ప్రతిఒక్కరినీ చిరునవ్వుతో పలకరిస్తూ షర్మిల జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. మొదటి విడతలో భాగంగా షర్మిల జిల్లాలో రెండ్రోజుల పాటు పర్యటించి మొత్తం 12 కుటుంబాలను పరామర్శించారు. 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామని కర్నూలు నల్లకాల్వ వద్ద వైఎస్ జగన్ మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఆకుటుంబ ప్రతినిధిగా వైఎస్ షర్మిల పరామర్శయాత్ర కొనసాగిస్తున్నారు. బాధిత కుటుంబాల్లో ధైర్యం నింపుతూ అండగా ఉంటామని వారికి భరోసా కల్పించారు. 
Back to Top