రాజన్న బిడ్డకు అపూర్వస్వాగతం..!

షర్మిలను చూసి పులకించిన ప్రజలు..!

వరంగల్ః దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సోదరి షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన రెండోదశ పరామర్శ యాత్ర చివరి రోజుకు చేరుకుంది. షర్మిల పర్యటనకు అపూర్వ స్పందన వచ్చింది.  పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు రాజన్న బిడ్డను చూసి పులకించిపోయారు. చిన్నా, పెద్దా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ షర్మిల పర్యటన కొనసాగిస్తున్నారు. యాత్రలో భాగంగా ఇవాళ పరకాల నియోజకవర్గంలో మొత్తం 4 కుటుంబాలను  పరామర్శిస్తున్నారు. 25 కి.మీ. మేర పరామర్శయాత్ర సాగుతుంది.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మృతిని తట్టుకోలేక మరణించిన వారికి భరోసానిచ్చేందుకు షర్మిల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఐదవ రోజు పరకాల నుంచి యాత్ర మొదలుపెట్టిన షర్మిల మల్కక్కపేటలోని రాసమల్ల తిరుపతి కుటుంబాన్ని పరామర్శించారు. ఆతర్వాత నాగారంలో కాంబత్తుల శ్రీహరి ఇంటికెళ్లి వారి కుటుంబసభ్యులను ఓదార్చారు. అక్కడి నుంచి లక్ష్మీపురం బయలుదేరి చెల్పూరి ఉప్పలయ్య కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. చివరగా మొగళ్లపల్లి మండలంలోని ఇసిపేటలో యార రాజయ్య కుటుంబాన్ని షర్మిల పరామర్శిస్తారు. దీంతో జిల్లాలో రెండో దశ యాత్ర పూర్తవుతుంది.  
Back to Top