వరంగల్ లో వైఎస్ షర్మిలకు ఆత్మీయ స్వాగతం...!

నాలుగోరోజు ఏడు కుటుంబాలకు పరామర్శ...!
పేదల బాంధవుడు వైఎస్సార్...! 
వరంగల్ః దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సోదరి షర్మిల చేపట్టిన పరామర్శ యాత్ర వరంగల్ జిల్లాలో నాలుగో రోజు కొనసాగింది.  రాజన్న బిడ్డను చూసి ఉప్పొంగిపోయారు. చేతులు కలిపేందుకు తహతహలాడారు. పిల్లలు, వృద్ధుల్ని షర్మిల ఆత్మీయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. 
ఏడు కుటుంబాలకు పరామర్శ..!

మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని తట్టుకోలేక మృతిచెందిన వారిని ఓదార్చేందుకు నాలుగో రోజు షర్మిల జిల్లాలో విస్తృతంగా పర్యటించారు.  మొత్తం 107 కిలోమీటర్ల మేర పర్యటించి ఏడు కుటుంబాలను పరామర్శించారు. తొలుత నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలంలోని బంధంపల్లిలో ఎల్లాపురం కొమురమ్మ కుటుంబాన్ని ఓదార్చారు. ఆతర్వాత నేరుగా పరకాల నియోజకవర్గానికి బయలుదేరారు. ఆత్మకూరు మండలం  పెద్దాపురంలో వేల్పుల వీరస్వామి కుటుంబసభ్యులను పరామర్శించారు. తదనంతరం భూపాలపల్లి నియోజకవర్గం పత్తిపాకలో బోయిన నర్సయ్య, కోనరావుపేటలో తిప్పారపు మల్లమ్మ, సుల్తాన్ పూర్ లో గజవెల్లి వెంకట్రాజం  కుటుంబసభ్యుల్ని పలకరించారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.అక్కడి నుంచి కనిపర్తికి చేరుకొని పల్లెబోయి ఓదేలు కుటుంబాన్ని పరామర్శించారు. అందరినీ ఆత్మీయగా పలకరించారు. అందరికీ అండగా ఉంటామని భరోసా కల్పించారు.

ఆయన ఆశయాల కోసం కష్టపడుదాం..!
పరామర్శయాత్రలో షర్మిల వెంట తెలంగాణ వైఎస్సార్‌సీపీ అధ్య‌క్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,  కొండా రాఘవరెడ్డి ఇతర నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.   ప్రజలకోసం పరితపించిన నాయకుడు  వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని షర్మిల అన్నారు. పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశెపెట్టి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని షర్మిల పేర్కొన్నారు. ఆయన ఆశయాలు, కలల సాధన కోసం  ప్రతిఒక్కరం కృషిచేద్దామని  పిలుపునిచ్చారు. రేపు   రెండో దశ యాత్ర పూర్తవుతుంది. పరకాల నియోజకవర్గంలో 4 కుటుంబాలు, భూపాలపల్లి నియోజకవర్గంలో రెండు కుటుంబాలను వైఎస్ షర్మిల పరామర్శిస్తారు. !

తాజా ఫోటోలు

Back to Top