రాజ‌న్న బిడ్డ‌తో మ‌మేకం అయిన ఓరుగ‌ల్లు ప్రాంతం

రెండో రోజు సాగిన ష‌ర్మిల ప‌రామ‌ర్శ యాత్ర‌
జ‌న‌గామ‌, స్టేష‌న్ ఘ‌న్‌పూర్ నియోజ‌క వ‌ర్గాల్లో యాత్ర‌

వ‌రంగ‌ల్‌: వైఎస్సార్ సీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిల ప‌రామ‌ర్శ యాత్ర వ‌రంగ‌ల్ జిల్లాలో రెండో రోజు జ‌న‌గామ‌, స్టేష‌న్ ఘ‌న్ పూర్ నియోజ‌క వ‌ర్గాల్లో సాగుతోంది. రెండో రోజు ఏడు కుటుంబాల్ని ప‌రామర్శించేట్లుగా యాత్ర షెడ్యూల్ ను రూపొందించారు. 

జ‌న‌గామ నియోజ‌క వ‌ర్గం బ‌చ్చ‌న్న‌పేట మండ‌ల కేంద్రంలో ష‌ర్మిల త‌న యాత్ర‌ను ప్రారంభించారు. మొద‌ట‌గా గుడిసెల లచ్చ‌వ్వ‌, ఆలువాల యాద‌గిరి కుటుంబాల్ని ప‌రామ‌ర్శించారు. ఆ కుటుంబ స‌భ్యుల‌తో ఆమె మాట్లాడారు. ధైర్యాన్ని ఇచ్చారు. అనంత‌ర ఇదే మండ‌లంలోని పోచ‌న్న పేట‌లోని నేల‌పోగుల యాదగిరి కుటుంబానికి ఆమె భ‌రోసా ఇచ్చారు. కుటుంబ స‌భ్యుల బాగోగుల్ని అడిగి తెలుసుకొన్నారు. 
Back to Top