హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రె స్ పార్టీ గ్రేటర్ విస్త్రతస్థాయి సమావేశం గురువారం లోటస్‌పాండ్‌లోని కేంద్ర కార్యాలయంలో జరిగింది. పార్టీ హైదరాబాద్ జిల్లా పరిశీలకుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదిరులు హాజరయ్యారు. మొదట దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. గ్రేటర్ పరిధిలో త్వరలో వైఎస్ షర్మిల పాదయాత్ర ఉంటుందని శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. త్వరలో పదివేల మందితో సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల శంఖారావం పూరిస్తామని చెప్పారు. పార్టీ భవిష్యత్తు జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై ఆధారపడి ఉందన్న విషయం మరువద్దని చెప్పారు.