రావికమతం వసతి గృహాన్ని పరిశీలించిన షర్మిల

రావికమతం 28 జూన్ 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ శ్రీమతి వైయస్ షర్మిల శుక్రవారం పాదయాత్ర చోడవరం నియోజకవర్గంలో సాగింది. పాదయాత్ర దారిలో ఉన్న  రావికమతం గ్రామ బాలికల సంక్షేమ వసతి గృహాన్ని ఆమె పరిశీలించారు. బాలికలతో మాట్లాడి యోగక్షేమాలను తెలుసుకున్నారు. హాస్టలులో వసతులు సరిగా లేవని బాలికలు శ్రీమతి షర్మిలకు చెప్పారు. వసతుల లేమిపై షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. మొత్తం హాస్టలులో ఆమె కలియదిగారు. వంట గదినీ, అందులో ఉన్న బియ్యాన్నీ  పరిశీలించారు. స్నానాల గదులను, పాయిఖానాలను కూడా చూశారు.  నీరు రెండు గంటలు మాత్రమే వస్తుందని బాలికలు శ్రీమతి షర్మిలకు చెప్పారు. వార్డెన్‌తో కూడా మాట్లాడారు. రెండు పూటలా తామే అన్నం వండుకుంటామని బాలికలు శ్రీమతి షర్మిలకు తెలిపారు. ఆమెతో కరచాలనానికి బాలికలు పోటీపడ్డారు.  కరెంటు ఉంటోందా లేదా,  ఉపకార వేతనాలు సకాలంలో అందుతున్నాయా లేదా.. అవి  సరిపోతున్నాయా లేదా అనే విషయాలను శ్రీమతి షర్మిల బాలికలను అడిగి తెలుసుకున్నారు. అంతా బాగా చదువుకోవాలని చెప్పారు. తాగడానికి నీరు లేకపోవడం పట్ల ఆవేదన వ్యక్తంచేశారు. స్నానాల గదులు లేకపోవడం దురృష్టకరమన్నారు. కొన్నాళ్ళలో జగనన్న ముఖ్యమంత్రి అవుతాడనీ, మన ప్రభుత్వం వస్తుందనీ, అప్పుడు అంతా బాగుంటుందని బాలికలకు శ్రీమతి షర్మిల చెప్పారు.  మార్కులు బాగా వస్తున్నాయా అని వారిని ఆమె చమత్కారంగా ప్రశ్నించారు.

Back to Top