కొనసాగుతున్న మరో ప్రజా ప్రస్థానం

ప్రత్తిపాడు 21 జూన్ 2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల 186వరోజు శుక్రవారం పాదయాత్ర ఆరంభమైంది. కిందటేడాది అక్టోబర్ 18న ఆమె వైయస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయలో మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని శాంత్రి ఆశ్రమం ఆర్చి నుంచి పాదయాత్రను మొదలు పెట్టారు. శంఖవరం మీదుగా శృంగవరం , బంగారయ్యపేట వరకూ ఆమె పాదయాత్ర చేస్తారు.

Back to Top