యాదగిరి కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ

చేర్యాల: వరంగల్ జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల చేపట్టిన పరామర్శ యాత్ర సోమవారం చేర్యాల మండల కేంద్రం నుంచి ప్రారంభమైంది. ముందుగా ఆమె చేర్యాల పెద్దమ్మగడ్డ ప్రాంతంలోని బస్వగల్ల యాదగిరి కుటుంబాన్ని పరామర్శించారు. వైఎస్ఆర్ మరణాన్ని తట్టుకోలేక తనువు చాలించిన యాదగిరి తల్లిదండ్రులు బాలనర్సయ్య, లక్ష్మిలను ఓదార్చారు.

యాదగిరి తమ్ముడు కృష్ణ, చెల్లెలు లలితలతో మాట్లాడారు. వారి కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఆమె మద్దూర్ మండలంలోకి ప్రవేశించారు. ఆమె వెంట ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర నేతలు కొండా రాఘవరెడ్డితోపాటు మహేందర్రెడ్డి, లింగారెడ్డి, చంద్రాచారి తదితరులు ఉన్నారు.

అంతకుముందు ఉదయం మెదక్ జిల్లా ప్రజ్ఞాపూర్ లో షర్మలకు పార్టీ నేతలు , కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అక్కడ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం వరంగల్ బయల్దేరి వెళ్లారు.
Back to Top