వరంగల్ లో ముగిసిన షర్మిల పరామర్శయాత్ర..!

కరీంనగర్ లోప్రారంభం..తొలివిడతలో 12 కుటుంబాలకు పరామర్శ..!
తెలుగుప్రజల గుండెల్లో చెరగని ముద్ర రాజన్న..!

వరంగల్ః దివంగత ముఖ్యమంత్రి, వైఎస్. రాజశేఖర్ రెడ్డి తనయ, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్ సోదరి వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన పరామర్శయాత్ర ముగిసింది. షర్మిల యాత్రకు  జిల్లాలో అపూర్వ స్పందన వచ్చింది. రాజన్న బిడ్డను ప్రజలు అక్కున చేర్చుకొని ఆదరించారు. అందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ షర్మిల జిల్లాలో పరామర్శయాత్ర కొనసాగించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మృతిని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబసభ్యుల్లో భరోసా కల్పించేందుకు.... జిల్లాలో మొత్తం మూడు విడతల్లో 12 రోజుల పాటు పర్యటించి 73 కుటుంబాలను షర్మిల పరామర్శించారు. అండగా ఉంటామని బాధిత కుటుంబాల్లో ధైర్యం నింపారు.

కరీంనగర్ జిల్లాలో యాత్ర ప్రారంభం..!
వరంగల్ జిల్లాలో పర్యటన ముగించుకొని కరీంనగర్  చేరుకున్న షర్మిలకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు మేడిపల్లి వద్ద ఆత్మీయ స్వాగతం పలికారు. మూడు రోజుల పాటు జిల్లాలో పరామర్శయాత్ర కొనసాగుతుంది. తొలుత కాటారం మండలం, బోర్లగూడెంలో అసోదుల రామయ్య కుటుంబాన్ని వైఎస్ షర్మిల పరామర్శించారు. వైఎస్. రాజశేఖర్ రెడ్డి మరణాన్ని జీర్ణించుకోలేక జిల్లాలో మొత్తం 30 మంది చనిపోయారు. తొలివిడత పరామర్శయాత్రలో షర్మిల 12 కుటుంబాలను పరామర్శిస్తారు. మంథని, పెద్దపల్లి, ధర్మపురి, జగిత్యాల, కోరుట్ల,చొప్పదండి నియోజకవర్గాల మీదుగా మొత్తం  371 కి.మీ. మేర పరామర్శయాత్ర సాగుతుంది.

రాజన్నకు మరణం లేదు..!
మహానేత వైఎస్. రాజశేఖర్ రెడ్డికి మరణం లేదని...తెలుగుజాతి ఉన్నంతకాలం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని షర్మిల అన్నారు. పరామర్శయాత్రలో భాగంగా కరీంనగర్ జిల్లా, కాటారం మండలం, గారేపల్లి చౌరస్తాలో ప్రజలనుద్దేశించి వైఎస్ షర్మిల ప్రసంగించారు. ప్రజల బాధను తనదిగా భావించి ప్రతిఒక్కరికీ మేలు చేయడం వల్లే రాజశేఖర్ రెడ్డి...రాజన్న అయ్యారని పేర్కొన్నారు. 

Back to Top