వైఎస్ షర్మిలకు ఆత్మీయ స్వాగతం..!

రాజన్న బిడ్డకు జననీరాజనం...!

వరంగల్ః ప్రియతమ నేత దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సోదరి షర్మిల..వరంగల్ జిల్లాలో మలివిడత పరామర్శయాత్ర చేస్తున్నారు. షర్మిలకు ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. చిన్నా, పెద్ద అందరినీ నవ్వుతూ పలకరిస్తూ షర్మిల ముందుకు సాగుతున్నారు. మంగపేట మండలం బండారిగూడెంలో యాత్ర ప్రారంభించిన షర్మిల మొదటగా దోమగండి ముత్తయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ఆతర్వాత  రాజుపేటలో దుబ్బ ముత్తయ్య, ఏటూరి నాగారంలో వలస చిన్నక్క, గోవిందరావుపేట మండలం, దుంపెల్లిగూడెంలో దేవిరెడ్డి రాంచంద్రారెడ్డి, చల్వాయిలో మేడపల్లి అమ్మాయమ్మ , బుస్సాపూర్ లో బేతి వెంకట్ రెడ్డి కుటుంబాలను వైఎస్ షర్మిల ఓదార్చారు. వారిలో ధైర్యాన్ని నింపారు.  

వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మృతిని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని కర్నూలు జిల్లాలో నల్వకాల్వ సాక్షిగా వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటను నిలబెట్టేందుకు ఆకుటుంబప్రతినిధిగా షర్మిల జిల్లాలో పర్యటిస్తూ బాధిత కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నారు. మొదటివిడత యాత్రలో భాగంగా ఆగస్టు 24-28 వరకు జిల్లాలో మొత్తం 32 కుటుంబాలను వైఎస్ షర్మిల పరామర్శించారు. ఆతర్వాత రెండో విడత పరామర్శయాత్రలో సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు మొత్తం 30 కుటుంబాలను షర్మిల ఓదార్చారు. మలివిడత పరామర్శయాత్రలో ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాల్లో మొత్తం 11 కుటుంబాలను పరామర్శిస్తున్నారు.  

రాజన్న బిడ్డకు జన నీరాజనం..!
మంగళవారం మరో ఐదు కుటుంబాలను పరామర్శించిన అనంతరం షర్మిల కరీంనగర్ జిల్లాలో పరామర్శయాత్ర మొదలుపెడతారు. మంథని నియోజకవర్గంలో మేడిపల్లి నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. జిల్లాలో మొత్తం 12 కుటుంబాలను వైఎస్ షర్మిల పరామర్శిస్తారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top