మంత్రి ఇంటి ముట్టడి

గుంటూరు(చిలకలూరిపేట): రుణమాఫీ కోసం రెండేళ్లుగా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన రైతులు.. ఎంతకు మాఫీ కాకపోవడంతో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని మంత్రి పత్తిపాటి పుల్లారావు నివాసాన్ని గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన కౌలు రైతులు ముట్టడించారు. వందలాదిగా వచ్చిన రైతులు మంత్రి నివాసం ముందు బైఠాయించారు. కౌలు రైతుల రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, వచ్చే ఖరీఫ్ సీజన్ కోసం బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించాలని కోరారు.

Back to Top