బాబు అలా చెప్పుకోవడం సిగ్గుచేటు

కర్నూలు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ ఎంపీ, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేత అనంత వెంకట్రామిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 50 ఏళ్లుగా పోలవరం ప్రాజెక్ట్‌పై ఉద్యమం సాగిందని, అలాంటిది తనవల్లే పోలవరం సాధ్యమైందని చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు.

దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పూర్తి చేసిన ప్రాజెక్టులను చంద్రబాబు తన ఘనతగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. జిల్లాలో వైయస్‌ జగన్‌ చేపట్టిన రైతు భరోసా యాత్రకు అన్నదాతలు బ్రహ్మరథం పడుతున్నారని అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు. అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల్లో వైయస్‌ జగన్‌ ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారని ఆయన పేర్కొన్నారు.
Back to Top