ఎస్ఎఫ్ఐ నాయ‌కులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

నెల్లూరు:  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌డుతున్న పోరాటాల‌కు ఆక‌ర్శితులైన ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయ‌కులు వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగంలో చేరారు. నెల్లూరు జిల్లా సంగం మండల ఎస్ఎఫ్ ఐ విద్యార్ధి విభాగ నాయకులు  ప్రసాద్, ప్రశాంత్, మావో, అవినాష్, అనిల్, కార్తీక్, మహేష్ తదితరులు బుధ‌వారం ఎమ్మెల్యే మేక‌పాటి గౌతమ్‌రెడ్డి స‌మ‌క్షంలో పార్టీలో చేరారు. వీరికి శాసన సభ్యులు శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి కండువాలు క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ..చంద్ర‌బాబు ఎన్నిక‌ల ముందు ఇంటికో ఉద్యోగం ఇస్తామ‌ని, నిరుద్యోగ భృతి చెల్లిస్తామ‌ని హామీ ఇచ్చి మాట త‌ప్పారన్నారు. ఎన్నిక‌ల హామీలు నెర‌వేర్చాల‌ని వైయ‌స్ జ‌గ‌న్ పోరాటం చేస్తున్న‌ట్లు చెప్పారు.  కార్య‌క్ర‌మంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు దేవరపల్లి శ్రీనివాసులు రెడ్డి  , అల్లారెడ్డి సతీష్ రెడ్డి   ,  సంగం మండల వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కంటాబత్తిన రఘునాధ్ రెడ్డి . నాయకులు మెట్టుకూరు వాసుదేవరెడ్డి   ఉన్నారు. 

Back to Top