వైయస్సార్ జయంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు

కరీంనగర్: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి  67వ జయంతి వేడుకలు కరీంనగర్లో శుక్రవారం ఘనంగా జరిగాయి. తెలంగాణ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ నాగేశ్, జిల్లా అధ్యక్షుడు ఆకెనపల్లి కుమార్ ఆధ్వర్యంలో వైయస్ఆర్ జయంతి వేడుకలు జరిగాయి. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించరాఉ. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Back to Top