వైయస్‌ జగన్‌ను కలిసిన సీరియల్‌ ఆర్టిస్ట్‌ కృష్ణ కిశోర్‌


తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ఇటీవల సినిమాటోగ్రఫర్‌ చోటా కే నాయుడు వైయస్‌ జగన్‌ను కలిసి మద్దతు ప్రకటించగా తాజాగా సీరియల్‌ ఆర్టిస్టు కృష్ణ కిశోర్‌ కలిశారు. గురువారం అనపర్తి నియోజకవర్గంలోని ఉలపల్లె వద్ద ఆయన జననేతను కలిసి కొంత దూరం నడిచి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా కృష్ణ కిశోర్‌ మాట్లాడుతూ..వైయస్‌ జగన్‌ ప్రజల కోసం పడుతున్న కష్టం కళ్లకు కట్టినట్లు కనిపించిందన్నారు. ప్రజలకు మంచి చేయాలన్న తపనతో వైయస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తున్నారన్నారు. వైయస్‌ జగన్‌ వల్లే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. జననేత మాములు నాయకుడు కాదని, ఆయన ఏం చేయాలనుకుంటే అది చేస్తారని, ఇచ్చిన మాట తప్పడన్నారు. వైయస్‌ జగన్‌ వేస్తున్న ప్రతి అడుగు ప్రజల కోసమే అని చెప్పారు. 2019లో వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రావడం ఖాయమని, జగనన్న సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. జనాలందరూ వైయస్‌ జగన్‌ రావాలని కోరుతున్నారని చెప్పారు. ప్రజల కోసం తాను చేయాల్సిందంతా చేస్తారని పేర్కొన్నారు. జగనన్న మీద ఉన్న అభిమానం గుండెల్లో నిలిచిపోయిందని, వైయస్‌ జగన్‌ ఎంత దూరం పాదయాత్ర చేసినా ఆయన వెంట జనాలు ఉంటారని తెలిపారు. 2019 మనదే అని, ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
Back to Top